అత్యంత భారీ అంచనాలతో విడుదల అయిన ‘భగవంత్ కేసరి’ బాలయ్య అబిమానులను కూడ పూర్తిగా మెప్పించలేక పోవడంతో ఈమూవీకి కలక్షన్స్ అంతంత మాత్రంగా వస్తున్నాయి. అయితే ఈమూవీతో పోటీగా విడుదల అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘లియో’ సినిమాలకు కూడ టాక్ అంతంతమాత్రంగా ఉండటంతో ఈమూడు మూవీలలో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే మూవీగా ‘భగవంత్ కేసరి’ మారింది.



ఈమూవీ 80 కోట్ల వరకు మార్కెట్ అవ్వడంతో ఈమూవీకి వచ్చిన డివైడ్ టాక్ వల్ల ఈమూవీ బయ్యర్లు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు తక్కువ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈవారం చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ విడుదల లేకపోవడంతో సినిమాలు చూడాలి అని భావించే సగటు ప్రేక్షకులకు ఒక్క ‘భగవంత్ కేసరి’ తప్ప మరొక ఆపక్షన్ లేకుండా పోయింది.



ఇది ఇలా ఉండగా ఈమూవీ దర్శకుడు అనీల్ రావిపూడిమూవీ కలక్షన్స్ నిలబెట్టడానికి మరొక ప్రయోగం చేయడంతో ఈమూవీ ఎంతవరకు నిలబడుతుంది అన్న సందేహాలు వస్తున్నాయి. ఈమూవీలో మాస మసాల సాంగ్స్ సీన్స్ లేకపోవడంతో ఒక మైనస్ గా మారింది అన్న కామెంట్స్ వచ్చిన నేపధ్యంలో 4 నిముషాలు నిడివితో ఉండే ఒక మాస్ సాంగ్ ను ఇప్పుడు ఈసినిమాకు యాడ్ చేస్తున్నారు.



ఈ సాంగ్ ను ఎప్పుడో చిత్రీకరించినప్పటికీ ఈమూవీ కథ ప్రధాన ఉద్దేశ్యం దెబ్బ తింటుంది అన్న ఆలోచనతో మొదట్లో ఈపాటను ఎడిటింగ్ లో పక్కకు పెట్టామని అయితే ఇప్పుడు బాలయ్య అభిమానుల కోసం ఈ సాబగ్ ను యాడ్ చేస్తున్నట్లు అనీల్ రావిపూడి ప్రకటించాడు. అయితే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈమూవీని ఎంతవరకు కొత్తగా యాడ్ చేయబోతున్న మాస సాంగ్ కాపాడుతుందో చూడాలి. గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న శ్రీలీల మ్యానియా కూడ ఈమూవీని పూర్తిగా కాపాదులేక పోవడంతో ఆమె క్రేజ్ నెమ్మదిగా యూత్ లో పడిపోతోందా అన్న మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: