ఆమధ్య నాగార్జున తన లేటెస్ట్ మూవీ ‘నాసామిరంగ’ షూటింగ్ పూర్తి కాకుండానే  ఆ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టి ఆసినిమా కోసం ప్రత్యేకంగా ఘాట్ చేసిన రెండు నిమిషాల  టీజర్  విడుదలచేసి అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా సినిమా ప్రమోషన్ విషయంలో నాగార్జున ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చూట్టాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను నేచురల్ స్టార్ నాని కూడ అనుసరిస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  



నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ టైటిల్ ఎనౌన్స్ మెంట్ కు సంబంధించిన టీజర్ ను చూసి అందరు షాక్ అయ్యారు. ఈసినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకపోయినప్పటికీ ఈమూవీకి సంబంధించిన రెండు నిముషాల టీజర్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప రోజు వస్తుందని అందరి నమ్మకం. అయితే ఆ గొప్పారోజు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.



ప్రతి వ్యక్తి అలాంటి రోజుకోశం ఎదురు చూస్తూ రోజులు గడుపుతూ ఉంటాడు. అంతేకాదు ఒక్కసారిగా తన జీవితాన్ని మలుపుతిప్పే సంఘటన ఏదో ఒకటి జరుగుతుందని చాలామంది ఆశ పడుతూ ఉంటారు. అయితే అలాంటి సంఘటన ఎప్పుడు ఏరోజు వస్తుందో ఎవరికీ తెలియని సస్పెన్స్. పెద్దలు ఎవరైనా ఆ డేట్ వచ్చే దాకా ఎదురు చూడమని చెపుతూ ఉంటారు.



అలాంటిది ఒక వ్యక్తికి ప్రతి వారంలో వచ్చే శనివారం జీవితాన్ని మలుపు తిప్పే రోజుగా మారితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ‘సరిపోదా శనివారం’ కథ ఉంటుందని లీకులు వస్తున్నాయి. ఒక పాడుబడిన షెడ్డు లాంటి చోట కాళ్లకు సంకెళ్లతో బంధింపబడి ఉన్న ఒక యువకుడు పీఠకత్తితో తన సంకెళ్ళు తెంచుకుని బయటికి వస్తాడు.



తన కోసం ఎదురు చూస్తున్న ఊరి జనం ముందు ప్రత్యక్షమవుతాడు. అసలేం జరిగిందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాలి అంటూ ఈమూవీ దర్శకుడు అంటున్నాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయచాలా విభిన్నంగా ఈమూవీని తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతి శనివారం నాని జీవితంలో వచ్చే అనూహ్యమైన మార్పు చుట్టూ డిఫరెంట్ పాయింట్ తో ఈసినిమాను తీస్తున్నాము అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: