ఈమూవీని వచ్చేఏడాది సమ్మర్ రేస్ లో విడుదలచేయాలని దిల్ రాజ్ పట్టుదల పై ఉండటంతో ఈమూవీ మ్యానియాను క్రియేట్ చేయడానికి రాబోతున్న దీపావళి నుండి ఈమూవీ ప్రమోషన్ ను మొదలుపెడుతున్నారు. ఈసినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ ను దీపావళి రోజున విడుదల చేస్తాము అని నిర్మాతలు ప్రకటించినప్పటికీ రామ్ చరణ్ ఆభిమానులలో పెద్దగా ఆశక్తి ఉత్సాహం కనిపించడం లేదు అన్నవార్తలు వస్తున్నాయి.
ఇలా చరణ్ అభిమానులలో ఉత్సాహం తగ్గిపోవాడానికి ఒక కారాణం ఉంది అన్నప్రచారం జరుగుతోంది. దీపావళి రోజున విడుదలచేయబోయే ఈమూవీకి సంబంధించిన మొదటి పాట ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఆ పాటను చాలామంది చరణ్ అభిమనులు వినడమే కాకుండా అనేకమంది తమ స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్స్ లో చాల జాగ్రత్తగా సేవ చేసుకున్నారట. ఈ పాట లీకైన కొన్ని గంటలలో చరణ్ అభిమానుల మధ్య వైరల్ మారి ఒకరి కోకరు షేర్ చేసుకున్నారు అని అంటారు.
దిల్ రాజ్ టీమ్ చాల తెలివిగా వ్యవహరించి సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియాలో ఈపాట ఎక్కడా వినపడకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పటికే జరగవలసిన డామేజ్ జరగడంతోచరణ్ అభిమానులు ఈపాటను ఇప్పటికే వినడంతో దీపావళి నాడు అధికారికంగా విడుదల కాబోతున్న ఈపాట పై చరణ్ అభిమానులలో ఆశక్తి లేదు అన్న ప్రచారం జరుగుతోంది. శంకర్ ఈపాట చిత్రీకరణ కోసం 16 కోట్లు ఖర్చు పెట్టాడు అన్న ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో 16 కోట్ల పాట పై చరణ్ అభిమానులలో ఆశక్తి లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి