బాలీవుడ్‌ ఇండస్ట్రీ కండల వీరుడుగా కొన్ని సంవత్సరాల పాటు ఒక  వెలుగువెలిగిన సల్మాన్ ఖాన్ పరిస్థితి ఏమిటి అంటూ బాలీవుడ్ మీడియా  విశ్లేషణలు చేస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రిలో ఖాన్ త్రయంగా పేరుగాంచిన  సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ లు మూడు దశాబ్దాల పైగా  ఇండస్ట్రీని శాసిస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్  మూడు దశాబ్దాలు పైగా  టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.  



ఉత్తరాది భారతంలో మాస్ ప్రేక్షకులు విపరీతంగా  ఇష్టపడే సల్మాన్ ఖాన్ నటిస్తున్న అనేక సినిమాలు వరశపెట్టి ఫెయిల్ అవుతూ ఉండటంతో అతడి మార్కెట్ పై అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి. సల్మాన్ కు సరైన హిట్ వచ్చి అనేక సంవత్సరాలు అవుతోంది. ‘భజరంగి భాయిజాన్’ ‘సుల్తాన్’ సినిమాలు తరువాత సల్మాన్ ఖాన్ కు ఒక్క హిట్ కూడ లేదు.



యాక్షన్ హీరోగా మాస ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న సల్మాన్ ఖాన్ నటించిన ‘రేస్ -3’ ‘దబంగ్ -3’  ‘కిసీ కా భాయ్ కిసి కి జాన్’ ఇలా అతడు నటించిన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారాయి. చిరంజీవితో కలసి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ కూడ అంచనాలను అందుకోలేక పోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పై అతడు పెట్టుకున్న ఆశలు అన్నీ నీరుకారిపోయాయి.



గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ ‘టైగర్ జిందా హై’ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో అతడి లేటెస్ట్ మూవీ ‘టైగర్ -3’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాల ఆశలు పెట్టుకున్నాడు. అయితే దీపావళి రోజున విడులైన ఈ మూవీ టోటల్ నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో పాటు ‘టైగర్’ ఫ్రాంఛైజీ మూవీలలో అతి చెత్త మూవీ అన్న పేరు తెచ్చుకుంది. ఈసినిమాకు సంబంధించి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మినహాయిస్తే ఇందులో ఎటువంటి మెరుపులు లేవు. కథలో కొత్తదనం లేకపోవడంతో ఈమూవీ సల్మాన్ అభిమానులకు కూడ నచ్చలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: