ఆ అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది ఆగష్టు 15 వరకు ఆగాల్సిందే. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ అప్పట్లో ఒక్కో యాడ్ చెయ్యడం కోసం కేవలం 35 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే తీసుకునేవాడు. స్టార్ హీరోలందరి కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో గా అప్పట్లో అల్లు అర్జున్ కి ఒక పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఒక్కో యాడ్ చెయ్యడం కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాస్ట్ అవ్వక తప్పదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవల్లో దేశం లోనే టాప్ 2 స్థానాల్లో ఉన్న సంస్థ 'జొమాటో'. ఎవరికైనా ఏదైనా ఇష్టమైన ఆహారం ని తినాలని అనుకుంటే ఈ రెండు యాప్స్ లో ఆర్డర్ చేస్తే చాలు, క్షణాల్లో ఇంటి ముందుకు వచ్చి వాలుతుంది.అల్లు అర్జున్ 'జొమాటో' యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థ కోసం ఆయన చేసే ఒక్కో యాడ్ కి 6 నుండి 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు అట. ఎక్కడ 35 లక్షలు, ఎక్కడ ఆరు కోట్లు..అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి