తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు తమిళనాడులో కూడ సంక్రాంతిని పెద్ద పండుగగా అక్కడి ప్రజలు పొంగల్ పేరుతో జరుపుకుంటూ ఉంటారు. దీనితో కాలీవుడ్ లో కూడ సంక్రాంతి సీజన్ కు భారీ సినిమాలు విడుదలకావడమే కాకుండా ఆసినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటారు. ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ను కొన్ని సంవత్సరాల క్రితం పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. 


కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల వారిద్దరు విడిపోయారు. మళ్ళీ ఈమధ్య వారిద్దరు కలిసారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఆవార్తల పై అటు ధనుష్ కాని ఇటు రజనీకాంత్ కానీ ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో వీరి విడాకుల వ్యవహారం పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ధనుష్ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఎప్పుడు రజనీకాంత్ సినిమాతో పోటీ పడలేదు. 


అయితే అనుకోకుండా జరిగిందా లేదంటే ధనుష్ కావాలని కోరుకున్నాడా అన్నవిషయం పై క్లారిటీ లేకపోయినా ఇప్పుడు ఏకంగా ధనుష్ రజనీకాంత్ మ్యానియాను లెక్కచేయకుండా తన లేటెస్ట్ మూవీని రజనీకాంత్ మూవీతో పోటీ పడుతూ సంక్రాంతికి వస్తు ఉండటం కాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ డిసెంబర్ రేస్ నుండి తప్పుకుని జనవరి పొంగల్ రేస్ కు రాబోతోంది. 


పొంగల్ కు రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటిస్తున్న ‘లాల్ సలామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీని తెలుగులో కూడ డబ్ చేసి జనవరి రెండవ వారంలో విడుదల చేయబోతున్నారు. ఈమూవీని ‘జైలర్’ ఇచ్చిన ఉత్సాహంతో రెట్టించిన చైతన్యంతో రజనీకాంత్ చాలవేగంగా పూర్తిచేశాడు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు సంక్రాంతికి కోలీవుడ్ లో ఎప్పుడు చూడని రజనీకాంత్ ధనుష్ వార్ జరగబోతోంది అనుకోవాలి. ఇప్పటికే సంక్రాంతి రేస్ కు రాబోతున్న అనేక సినిమాలు ధియేటర్లు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా రజనీకాంత్ ధనుష్ ల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీ పడుతున్న పరిస్థితులలో విజేత ఎవరు అన్న ఆశక్తి చాలమందిలో ఉంది.. 




ReplyForward

మరింత సమాచారం తెలుసుకోండి: