ఒక యంగ్ హీరోకు వరసగా మూడు ఫెయిల్యూర్స్ వస్తే అతడికి ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అతడిని ఇండస్ట్రీ వర్గాలు పెద్దగా పట్టించుకోరు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ సంచలన విజయం సాధించి 100 కోట్ల కలక్షన్స్ ను అందుకోవడంతో ఈ మెగా యంగ్ హీరోకు ఇక తిరుగులేదు అని భావించారు కానీ జరిగింది వేరు.



ఈ యంగ్ హీరో ‘ఉప్పెన’ తరువాత నటించిన ‘కొండపొలం’ ఆతరువాత అతడు నటించిన ‘రంగరంగ వైభవంగా’ సినిమాలు వరస ఫ్లాప్ లుగా మారడంతో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘ఆదికేశవ’ మూవీకి భయంకరమైన ఫ్లాప్ టాక్ రావడంతో ఈ మూవీకి రివ్యూలు వ్రాసిన కొందరు ‘కేశవాయనమహా’ అంటూ ఈ మూవీ గురించి మరిచిపొమ్మని చెపుతున్నారు.



ఒక సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ మూవీలో నటించిన హీరో తన పాత్రకు న్యాయం చేస్తే కనీసం విమర్శల ప్రశంసలు అయినా వస్తూ ఉంటాయి. అయితే ‘ఆదికేశవ’ సినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు తేజ్ మొఖంలో గ్లో తగ్గడమే కాకుండా అతడి మొఖంలో భావాలు వ్యక్త పరచలేకపోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ‘ఆడికేశవ’ సినిమాకు 20 సంవత్సరాల క్రితం సినిమాలలో కనిపించే స్క్రీన్ ప్లే ఇవ్వడంతో ఈ సినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు పెదవి విరవడమే కాకుండా పాత సినిమాను మళ్ళీ చూసినట్లుగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



సినిమా మొదటిరోజు కలక్షన్స్ చాల తక్కువ స్థాయిలో ఉండటంతో ఈ మూవీ బయ్యర్లు గగ్గోలు పెడుతున్నట్లు టాక్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ చేతిలో ఒక్క సినిమా కూడ లేదు అని తెలుస్తోంది. దీనితో ఈ యంగ్ హీరో మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే దర్శకులకు తన టీమ్ చేత ఫోన్ చేయిస్తున్నప్పటికీ చాలమంది దర్శక నిర్మాతలు తేజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: