నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా సౌర్యవ్ దర్శకత్వంలో హాయ్ నాన్న అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందించగా ... ఈ సినిమాను డిసెంబర్ 7 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ బృందం వరుస ఇంటర్వ్యూ లలో ... టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను సూపర్ గా ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదికను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 29 వ తేదీన సాయంత్రం 6 గంటలకు గోకుల్ పార్క్ ... ఆర్కే బీచ్ ... ఆపోజిట్ నోబెటల్ ... వైజాగ్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి హాయ్ నాన్న మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో తెలియాలి అంటే డిసెంబర్ 7 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: