టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ మంచి విజయాలను మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోతున్నాడు. కొంత కాలం క్రితమే ఈ నటుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ నటుడు శివ నర్వానా దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా రూపొందిన ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

ఇకపోతే ఈ మూవీ కూడా మంచి అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా కూడా ఈ నటుడికి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్నే మిగిల్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తు ఉండగా ... ఈ మూవీ కి పరశు రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.

కాకపోతే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను సంక్రాంతి రేసు నుండి తప్పించినట్లు మార్చి నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 8 వ తేదీన గాని 22 వ తేదీన కానీ విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లో ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: