
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్ బి కె 109 అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఊటీ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు జూబ్లీ హిల్స్ లో ఈ సినిమాకు సంబంధించిన రాత్రి పూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం రామ్ చరణ్ మరియు అంజలి పై మైసూర్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.