గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా రూపొందిన దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో తన అందాల ప్రదర్శనతో కూడా ఈ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ నటికి మొదటి మూవీ తోనే తెలుగు పరిశ్రమలో పంచు గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ కి వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా అనేక మంది స్టార్ హీరోల సరసన నటించిన ఇలియానా అతి తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. అలా తెలుగులో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ నటి హిందీ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపించింది. అందులో భాగంగా ఈ బ్యూటీ బర్ఫీ అనే మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటికి హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ పై మాత్రమే ఫోకస్ ను పెట్టి వరస హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఆన్ ఫెయిర్ అండ్ లవ్లీ ... లవర్స్ అనే సినిమాలలో నటించింది. ఈ మూవీ లు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇలియానా ...  మైఖేల్ డోలాన్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందని... పోయిన సంవత్సరం మే నెలలోనే వీరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ బ్యూటీ ఆగస్టు నెలలో ఒక మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. ఇక ఇప్పటికే ఒక మగ బిడ్డకు జన్మను ఇచ్చిన ఇలియానా తన ఆలనా పాలనా చూసుకోవడానికి సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: