టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి వాషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 7 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. అలాగే కొన్ని పాటలను విడుదల చేసింది.

వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ అనే పేరుతో ఈ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ మూవీ మేకర్స్ ఈ రోజు రాత్రి 6 గంటలకు అపోలో థియేటర్ ... ఫిలిం నగర్ లో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే నాని ఆఖరుగా దసరా అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ కూడా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో నాని కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు ఏర్పడింది. ఇక దసరా లాంటి మంచి సినిమా తర్వాత నాని నటించిన మూవీ కావడంతో హాయ్ నాన్న మూవీ పై కూడా ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో నాని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: