రంగంలో తన సత్తా చాటిన దివి ఆ తర్వాత 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో కీలక పాత్ర పోషించి ఆడియన్స్ దృష్టిలో పడింది. ఈ సినిమాతోనే దివికి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో తన ఆట తీరుతో పాటు తన అందంతో కుర్ర కారు మనసు దోచుకుంది. మత్తెక్కించే కళ్ళతో నాజూకు నడుము అందాలతో యూత్ ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంబంధించింది. బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలు

 గెలుచుకున్న దివి ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ లో ఓ చిన్న పాత్ర చేసింది. ఆకట్టుకునే అందం, టాలెంట్ ఉన్నా ఈ అమ్మడికి ఫుల్ లెన్త్ రోల్స్ లో నటించే ఛాన్స్ రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తోంది. ఇప్పటికే తన గ్లామర్ ట్రీట్ లో నెటిజన్స్ మతులు పోగోడుతున్న దివి తాజాగా తన వర్కౌట్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వర్కౌట్స్ లో పింక్ కలర్ అవుట్ ఫిట్ లో మరింత అందంగా కనిపించింది.

ఇంట్లోనే వర్కవుట్స్ చేసి చెమటలు చిందిస్తూ కనిపించిన దివి లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ అవుట్ ఫిట్ లో దివి స్ట్రక్చర్ చూసిన నెటిజెన్స్ ఈమె నిజంగానే హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దివి వర్కౌట్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా అంతట వైరల్ అవుతున్నాయి. కాగా బిగ్ బాస్ షోతో మంచి క్రైస్ట్ తెచ్చుకున్న దివి ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేసింది. నయిమ్ డైరీస్, క్యాబ్ స్టోరీస్, లంబసింగి వంటి సినిమాలో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా బిగ్ బాస్ 5 విన్నర్ వీజే సన్నీ నటించిన ATM అనే వెబ్ సిరీస్ లోనూ ఓ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: