కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన వారిలో తేజ ఒకరు. ఈయన చాలా తక్కువ బడ్జెట్ లో కొత్త నటీనటులతో సినిమాలను తెరకెక్కించి వాటితో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ దర్శకుడుగా ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకున్నాడు. అలా వరుసగా అనేక విజయాలను అందుకున్న ఈయన ఆ తర్వాత చాలా సినిమాలతో అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

అలాంటి సమయం లోనే ఈయన నేనే రాజు నేనే మంత్రి అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ మూవీ లో రానా దగ్గుపాటి హీరో గా నటించగా ... కాజల్ అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు సీత అనే సినిమాను తెరకెక్కించగా ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈయన దగ్గుపాటి అభిరామ్ హీరోగా అహింస అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల చేశారు.

సినిమా ప్రేక్షకులను అందించడంలో విఫలం అయింది. ఇలా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాను ఈ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: