తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో తేజ సజ్జ ఒకరు. ఈయన తన కెరియర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నాడు. ఇకపోతే గత కొంత కాలంగా ఈయన సినిమాలలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈయన కొన్ని సినిమాల్లో హీరోగా నటించగా ... అందులో ఎక్కువగా శాతం మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం తేజ సజ్జ ... ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన జాంబి రెడ్డి అనే మూవీ లో హీరో గా నటించాడు. సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. 

మూవీ తో తేజ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం తేజ ... ప్రశాంత్ కాంబోలో "హనుమాన్" అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుక జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

హనుమాన్ మూవీ మేకర్స్ ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదలకు సంబంధించిన అనౌన్స్మెంట్ ను డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు "హనుమాన్" చిత్రం నుండి అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: