యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ లభించింది. ఇకపోతే "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో సూపర్ క్రేజ్ ను వరల్డ్ వైడ్ గా సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న "దేవర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటి మనులలో ఒకరు అయినటువంటి జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అలాగే ఈ మూవీ విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క టీజర్ ను ఈ నెల చివరన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన పనులను కూడా ఇప్పటికే మొదలు పెట్టినట్లు మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: