ఏదైనా ఒక సినిమా ప్రారంభించే సమయంలో అనుకున్న బడ్జెట్ కు ఆ సినిమా పూర్తి అయ్యిందంటే చిత్ర బృందం చాలా ఆనంద పడుతూ ఉంటారు. అయితే అంతకంటే ఎక్కువ అయితే చాలా ఆందోళన చెందుతూ ఉంటారు ముఖ్యంగా చిన్న సినిమాలు అయితే కేవలం రెండు మూడు కోట్లలో తేడా ఉంటుంది. కానీ బడ హీరోల చిత్రాలు బడ్జెట్ పెరిగిపోయిందంటే అనుకున్న దానికంటే దాదాపుగా ఒక 30 కోట్లు వరకు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏకంగా చెప్పుకోబోయే సినిమా 60 కోట్ల బడ్జెట్ పెరిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


అసలు ఈ విషయంలోకి వెళ్తే తమిళ డైరెక్టర్ గా పేరుపొందిన వెట్రిమారన్ ఈ ఏడాది విడుదల పార్ట్ -1 పేరుతో ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ సినిమాలలో కమెడియన్ సూరి, విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తో మొదలు పెట్టాలనుకున్నారట విజయ్ సేతుపతిసినిమా కోసం కేవలం పది రోజులు మాత్రమే డేట్ లను అడ్జస్ట్ చేశారని.. వెట్రిమారని ఈ సినిమా మొత్తాన్ని 30 నుంచి 35 రోజుల వర్కింగ్ డేస్ లోనే ముగించాలని అనుకున్నారట.


సినిమా మొదలు పెట్టడం కోసం ఒక కొండమీద విలేజ్ ని సెట్ వేయడంతోపాటు కొండ కింద ఉన్న కొన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది అంట.. మిగిలిన మొత్తంలో షూటింగ్ను పూర్తిచేయాలనుకున్నారట.కానీ భారీ వర్షాల కారణంగా కొండ మీద వేసిన సెట్స్ మొత్తం 90% కొట్టుకుపోయాయట. దీంతో డైరెక్టర్ కథ మీద నమ్మకం ఉండడంతో నిర్మాతలు మళ్లీ మొదటి నుంచి సినిమా పనులను మొదలుపెట్టారు. అలా సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి విడుదల వరకు ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉన్నదట అయితే అనుకున్న బడ్జెట్ కాస్త ఏకంగా 65 కోట్ల రూపాయల వరకు చేరిందట. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయ్యి ఉంటే 60 కోట్లు నష్టం వచ్చేదని పలువురు కోలీవుడ్ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: