రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు , పృధ్వి రాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి రవి బుశ్రుర్ సంగీతం అందించగా ... "కే జి ఎఫ్ చాప్టర్ 1" మరియు "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ లకు దర్శకత్వం వహించి రెండు మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇకపోతే ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం నుండి ట్రైలర్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను 2 గంటల 55 నిమిషాల నిడివితో లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రభాస్ ..  ప్రశాంత్ నీల్ కాంబో లో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో తెలియాలి అంటే డిసెంబర్ 22 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: