విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఈయన అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రూపొందించాడు. ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది.

 ఇక ఈ మూవీ తో ఈయన క్రేజ్ హిందీ సినీ పరిశ్రమలో కూడా బాగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సందీప్ ... రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ప్రస్తుతం ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్  గా దక్కుతున్నాయి.

 ఇకపోతే ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సందీప్ మాట్లాడుతూ ... మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలని ఉంది. చిరంజీవి గారితో నాకు అదిరిపోయే యక్షన్ డ్రామా మూవీ చేయాలని ఉంది. అవకాశం వస్తే చిరంజీవి గారితో ఒక యాక్షన్ డ్రామా సినిమా చేస్తాను అని తాజా ఇంటర్వ్యూ లో సందీప్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం సందీప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: