చాలా చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎవరు ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇక అప్పట్లో ఈ సినిమా విడుదలై ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కింది. అంతేకాదు ఎంతటి కలెక్షన్లు సునామీ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాంతోపాటు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య నటనకి

 మంచి మార్కులు వచ్చాయి. యూట్యూబ్ గా  కెరియర్ నూ ప్రారంభించిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ చేసి చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అనంతరం మొదటిసారి బేబీ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమాతోనే హీరోయిన్గా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని గెలుచుకుంది. ఈ  సినిమా సక్సెస్ తరువాత వైష్ణవి చైతన్యకి హీరోయిన్గా భారీ అవకాశాలు వస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన స్థాయిలో ఆమెకి తర్వాత సినిమాల్లో అవకాశాలు రాలేదు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ  కి డైరెక్టర్ సాయి రాజేష్ 

 సినిమాలో అవకాశాన్ని ఇచ్చినట్లుగా సమాచారం. అది కూడా స్టార్ హీరో రామ్ పోతినేని సినిమాలో అని తెలుస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పొతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీలో వైష్ణవిని రెండో హీరోయిన్ గా తీసుకుందామని చిత్రబృందం భావించిందంట.. కానీ లాస్ట్ మినిట్ లో కాదనుకుని ఆమె స్థానంలో మరో కథనాయకను తీసుకున్నారని తెలుస్తోంది. అయితే వైష్ణవితో ఐటమ్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ ఆఫర్ కు వైష్ణవి చైతన్య సైతం ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..  !!

మరింత సమాచారం తెలుసుకోండి: