తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో భాగంగా తాజాగా ఈయన మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం అనే మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాలో శ్రీ లీలా , మీనాక్షి చౌదరి ... మహేష్ సరసన హీరోయిన్ లుగా నటించగా ... మాటల మాతృకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రమ్య కృష్ణ , జయరామ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇకపోతే ఈ సినిమాలో జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ చిత్ర బంధం అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్ ను జనవరి 6 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు అయితే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకొని అవకాశాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ నిర్మాత నాగ వంశీ తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన గుంటూరు కారం మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ ... గుంటూరు కారం సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది. ఈ మూవీ ఫస్ట్ అఫ్ మహేష్ బాబు ఎలివేషన్స్ సీన్స్ తో ఫాన్స్ కి ట్రీట్ లా ఉంటుంది. ఆ తర్వాత ఈ మూవీ లోని సెకండ్ హాఫ్ లోని ఆఖరి 45 నిమిషాలు ప్యూర్ మాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: