సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన గుంటూరు కారం సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను పాటలను విడుదల చేసింది. వాటిలో చాలా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే జనవరి 7 వ తేదీన ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు , అలాగే అందులోనే ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయింది. కాకపోతే ఈ సినిమా ట్రైలర్ ను మాత్రం రేపే విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొంత సమయంలో వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది.

ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ సభ్యుల నుండి అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు ఇది అసలు సిసలైన సంక్రాంతి పండుగ అని , మూవీ మొదలైనప్పటినుండి పూర్తి అయ్యే వరకు ఎక్కడ బోర్ కొట్టించకుండా ఒక అద్భుతమైన కథాంశంతో ఈ సినిమా ముందుకు సాగుతుంది అని,  ఇలాంటి సినిమా పండక్కి విన్నర్ గా నిలుస్తుంది అని సెన్సార్ సభ్యుల వారు గుంటూరు కారం మూవీ కి రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇలా సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ అభిమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: