
మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి వంటి హీరోయిన్స్ సైతం నటించారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ తదితర నటీనటులు నటించారు. ఇందులో మహేష్ బాబు శ్రీలీల డ్యాన్స్ కి సైతం అభిమానులు ఫిదా అయ్యారు. అయితే గుంటూరు కారం సినిమాకి తమన్ సంగీతాన్ని ఎంతో అద్భుతంగా అందించారు.. మాస్ బీటుకు మహేష్ అదిరిపోయి స్టెప్పులేస్తూ ఉండడమే కాకుండా కూర్చి మడత పెట్టేసాను కూడా అద్భుతంగా నటించింది. చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన పూర్ణ ఆమె ప్లేస్ లో ముందుగా బుల్లితెర యాంకర్ అయినటువంటి రష్మీ ని అనుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
గుంటూరు కారం సినిమా ఆఫర్ వస్తే రష్మీ రిజెక్ట్ చేసిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పైన రష్మి స్పందిస్తూ.. తనకు గుంటూరు కారం సినిమా ఆఫర్ రాలేదని అసలు రిజెక్ట్ చేసిన వార్తలలో నిజం లేదంటూ తెలిపింది.. చిత్ర బృందమే తనను సంప్రదించలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చింది.ఇవన్నీ కేవలం ఫేక్ న్యూస్ అంటూ తన పైన కావాలని ఎవరు నెగటివ్ తీసుకువచ్చే విధంగా ఇలా చేస్తున్నారంటూ తెలిపింది. రష్మీ యాంకర్ గా రాణిస్తూనే అడపా దడపా సినిమాలలో నటిస్తూ ముందుకు వెళుతోంది. ఇటీవల చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కూడా కనిపించింది.