ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుబ్గుమ్మలలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ నటి కొంత కాలం క్రితం సుశాంత్ హీరో గా రూపొందినటువంటి ఇచట వాహనములో నిలుపరాదు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత రవితేజ హీరో గా రూపొందిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కిలాడి సినిమాలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో ఈ సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ బ్యూటీ కి మాత్రం బాగానే ఈ మూవీ ద్వారా క్రేజ్ లభించింది. 

ఇక ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరసగా సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందినటువంటి గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందుతున్న గొట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ నటి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా మీనాక్షి అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ ప్యాంట్ ను డిఫరెంట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ టాప్ ను వేసుకొని ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మీనాక్షి కి సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: