సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్..లు హీరోయిన్లుగా 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమా రూపొంది మొన్న శుక్రవారం రిలీజైన సంగతి తెలసిందే.
విభిన్నమైన సబ్జెక్టులు డీల్ చేసే వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ లభించింది. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 'నిజమే నే చెబుతున్నా' అనే పాట చార్ట్ బస్టర్ అవ్వడమే కాకుండా ఈ సినిమా పై అంచనాలు పెరగడానికి కూడా కారణమైంది. మార్నింగ్ షోకు డివైడ్ టాక్ తెచ్చుకున్నా వీకెండ్ బాగానే పరుగెత్తింది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ నేఫద్యంలో మిగతా వారం అంతా ఎలా ఫెరఫార్మ్ చేసిందో చూద్దాం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సోమవారం 'భైరవకోన' కలెక్షన్లలో బాగా డ్రాప్ కనిపించింది. వీక్ డేస్‌లో మార్నింగ్ షోలు, మ్యాట్నీలకు థియేటర్లు డీలా పడిపోయాయి. ఈవెనింగ్, నైట్ షోలకు కూడా వసూళ్లు చెప్పుకోదగిన రీతిలో లేవు. దాదాపు 65% శాతం దాకా డ్రాప్ కనపడుతోంది. ఈ డ్రాప్ చూస్తూంటే రాబోయే రోజుల్లో కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. మీడియాలో కూడా ఈ సినిమా గురించి జనాలు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. సోషల్ మీడియాలో అయితే హడావుడి లేనేలేదు.

పోనీ ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి ఆశపెట్టుకుందాం అనుకుంటే బజ్ ఉంటే నిలబడేది. కానీ అది కనపడటం లేదు. ఈ వారం రిలీజు అవుతున్న సినిమాలు అన్నీ చిన్నవే. సిద్దార్థ రాయ్, సుందరం మాస్టార్, మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌లకు తోడు భ్రమయుగం అనే డబ్బింగ్ మూవీ బాక్సాఫీస్ హంగామా చేయబోతోంది. వీటి తట్టుకుని 'ఊరు పేరు భైరవకోన' వీకెండ్లో వర్కవుట్ అయినా బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుందేమో చూడాలి. ఏదైమైనా సూపర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ 'ఊరు పేరు భైరవ కోన'లో కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌ స్లోగా సాగినప్పటికీ.. కథ ఆకట్టుకునేలా ఉంటుంది. సెకండాఫ్‌ కొంత సమయం తర్వాత ట్రాక్ తప్పేసింది. మ్యూజిక్ సినిమాకు పెద్దగా కలిసి రాలేదు. ఓవరాల్ చూసుకుంటే ఈ సినిమా పాజిటివ్ టాక్ ఉంది కానీ ఆ స్దాయిలో కలెక్షన్స్ అయితే లేవు. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: