డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీసింది ఇప్పటివరకు రెండు సినిమా మాత్రమే. కానీ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయితే సందీప్ రెడ్డి వంగా తీసిన ప్రతి సినిమా కూడా ఎప్పుడు సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటుంది. ఇక ఇటీవల వచ్చిన యానిమల్ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది అని చెప్పాలి.


 అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించింది తన అందం అభినయంతో మాత్రమే కాదు తన నటనతో కూడా ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ అయినప్పటికీ ఇక మరో నటి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎవరో కాదు తృప్తి దిమ్రి. ఈమే రణబీర్ కపూర్ తో ఇంటిమేట్ సీన్లో నటించి అందరిని అవాక్కయ్యేలా చేసింది. దీంతో ఇక యానిమల్ సినిమా విడుదలైన తర్వాత ఎన్నో రోజులపాటు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది తృప్తి తిమ్రి.


 ఈ క్రమంలోనే యానిమల్ మూవీలో నటించిన ఇంటిమేట్ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. యానిమల్ మూవీలో ముందుగా ఇంటిమేట్ సీన్ చేయడానికి తన పేరెంట్స్ అంగీకరించలేదు అంటూ తృప్తి దుమ్రి చెప్పుకొచ్చింది. అయితే ఈ మూవీలో ఇలాంటి సీన్ ఉందని చెప్పగానే నా పేరెంట్స్ ఎంతగానో భయపడిపోయారు. నాకోసం ఆలోచించే వారు వద్దని చెప్పారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత మాత్రం నా పాత్రకు మంచి పేరు రావడంతో చివరికి తల్లిదండ్రులు మెచ్చుకున్నారు అంటూ తెలిపింది. నటి అన్న తర్వాత అన్ని పాత్రలో నటించాలని నా పేరెంట్స్ కి తెలియదు అంటూ తృప్తి  చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: