సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.ముఖ్యంగా ఈ మూవీలో సమంత ఐటమ్ సాంగ్‌కు చాలా క్రేజ్ వచ్చింది. మూవీ రిలీజ్ అయ్యాక ఎక్కడ చూసినా ఊ.. అంటవా అనే సాంగ్ వినబడినది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించగా, సమంత ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. ఇక ఈ సినిమా హిట్ అందుకోవడంలో సామ్ ఐటమ్ సాంగ్ కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే, పుష్ప సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. 2024 ఆగస్టు 15న పుష్ప2 థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు చర్చంతా ఈమూవీ స్పెసల్ సాంగ్‌ ఎవరు చేయనున్నారని? కాగా, పుష్ప2లో అందాల ముద్దుగుమ్మ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పుష్ప2లో కనిపించనున్నట్టు టాక్.ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది.ఇక ప్రస్తుతం జాన్వీకపూర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర మూవీలో హీరోయిన్‌గా చేస్తుంది. ఇక ఈ సినిమాలో ఈ అమ్మడు పల్లెటూరి పిల్లలా కనిపించబోతున్నట్లు టాక్. అంతే కాకుండా జాన్వీ చేతిలో తెలుగులో రెండు బడా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ అమ్మడు పుష్ప స్పెషల్ సాంగ్‌లో ప్రేక్షకులను ఎలా అట్రాక్ట్ చేస్తుందో చూడాలంటున్నారు ఫ్యాన్స్.పుష్ప-2 ఐటమ్ సాంగ్‌కి రోజుకో వార్త సోషల్ మీడియాలో పుట్టుకొస్తూనే వున్నాయి. పుష్ప-2లో ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పుష్ప 2: రూల్‌లో ఐటెం సాంగ్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాది టాప్ హీరోయిన్ సమంత రూత్‌ ప్రభు పుష్పలో "ఊ అంటావా" ఐటెం సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈసారి సామ్ కాకుండా.. ట్రెండింగ్ హీరోయిన్‌ను రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. ఇందుకోసం నటి జాన్వీ కపూర్‌ని పరిశీలిస్తున్నారు. జాన్వీ కపూర్‌తో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పారితోషికం వర్కౌట్ అయితే.. జాన్వీ ఈ పాటకు ఓకే చెప్పేలా వున్నట్లు సమాచారం. పుష్ప 2 విడుదలకు దగ్గరవుతున్నందున, త్వరలో పాట షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ యాక్షన్ దేవరలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: