సంక్రాంతి రేస్ లో విడుదలై ఊహించని ఘన విజయం సాధించిన ‘హనుమాన్’ ఎట్టకేలకు ఓటీటీ లో విడుదలైంది. ఈ మూవీని టీవీలలో ఫోన్స్ లో చూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాకు 300 కోట్లు ఎలా వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ‘హనుమాన్ దెబ్బకు ‘గుంటూరు కారం’ మూవీని అప్పట్లో పట్టించుకోని ప్రేక్షకులు ఈసినిమా గ్రాఫిక్స్ ఏమి బాగున్నాయి అంటూ కామెంట్స్ సోషల్ మీడియాలో చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఆ కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.మూవీ ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడు అంటూ అనేకమంది ఈ మూవీ దర్శకుడుని నిర్మాతని సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఒక గ్రాఫిక్స్ సినిమాని ధియేటర్లలో చూసినప్పుడు వచ్చే అనుభూతి ఓటీటీలో చూసినప్పుడు రాదు. దీనికితోడు ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ పై గ్రాఫిక్స్ మాయాజాలాన్ని చూసినప్పుడు ప్రేక్షకుల అనుభూతి వేరే విధంగా ఉంటుంది. ఇళ్ళల్లో ఉంటూ వారి సొంతపనులు చేసుకుంటూ ఓటీటీలో సినిమాలు చూసేవారు ధియేటర్లలో చూసిన ఆనందాన్ని పొందలేరు అన్నది వాస్తవం.ఇదే సూత్రం ‘హనుమాన్’ మూవీకి కూడ వర్తిస్తుంది అనుకోవాలి. సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘గుంటూరు కారం’ సుమారు 120 కోట్ల కలక్షన్స్ వసూలు చేసినా ఆ మూవీని ఫెయిల్యూర్ సినిమాల లిస్టులో వేశారు. ఆ షాక్ తో త్రివిక్రమ్ మరో సినిమా ప్రాజెక్ట్ ను ప్రకటించే విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అంటే ‘గుంటూరు కారం’ షాక్ త్రివిక్రమ్ ను ఏవిధంగా ప్రభావితం చేసిందో అర్థం అవుతుంది.రికార్డులు క్రియేట్ చేసిన ‘అవతార్’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలను ఓటీటీలో కంటే ధియేటర్లలోనే ఎక్కువగా ప్రేక్షకులు చూశారు అన్నది వాస్తవం. అందువల్లనే ధియేటర్లలో ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు అన్నీ ఓటీటీ ప్రేక్షకులకు నచ్చుతాయి అని ఆశించడం కుదరదు అన్న విషయం ‘హనుమాన్’ ఓటీటీ రిలీజ్ మరొకసారి రుజువు చేస్తోంది..  
మరింత సమాచారం తెలుసుకోండి: