ఇండియాలో సెన్సార్ నిబంధనలు చాల విచిత్రంగా మారుతున్నాయి. ద్వందార్థాలతో కూడిన డైలాగ్స్ తో ఉన్న అనేక సినిమాలకు సెన్సార్ క్లీన్ సర్టిఫికెట్ ఇస్తోంది. ఇలా ఎందుకు జరిగింది అని ఎవరైనా విమర్శలు చేస్తే ఆకథకు అలాంటి డైలాగ్స్ అలాంటి సీన్స్ అవసరం అంటూ క్లారిటీ ఇస్తున్నారు. అయితే సామాజిక స్పృహతో తీసిన కొన్ని సినిమాలకు మాత్రం సెన్సార్ నుండి ఇబ్బందులు ఎదురవ్వడం ఒక పరిపాటుగా మారింది.దాదాపు 17సంవత్సరాల క్రితం వచ్చిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఆరోజులలో ఒక సంచలనం. ఈమూవీతో అప్పట్లో ఏఆర్ రెహమాన్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఆమూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన దేవ్ పటేల్ ఇప్పుడు హీరోగా మారాడు. ‘మంకీ మ్యాన్’ పేరుతో దేవ్ ఒక హాలీవుడ్ మూవీ తీసి గత మార్చి 12న ఎస్ఎక్స్ఎస్డబ్ల్యు ఈవెంట్ లో రిలీజ్ చేశాడు. ఈసినిమాను చూసి విమర్శకులు విపరీతంగా మెచ్చుకున్నారు.ఈసినిమా ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడి అనేక అవార్డులు కూడ తెచ్చుకుంది. ఈమూవీలో హీరో  తల్లి హత్యకు కారణమైన వాళ్ళను అంతం చేసేందుకు హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకుని రంగంలోకి దిగే ఒక యువకుడి కథ ఇది. వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకుని పలువురు అధికారులు చేసే దారుణాలు ఈ మూవీలో చాల సహజంగా తీశారని తెలుస్తోంది.ఈ మూవీలో మతాల సెంటిమెంట్స్ ని దెబ్బ తీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఆసీన్స్ కు సెన్సార్ వర్గాలు అభ్యంతరం చెపుతున్నట్లు టాక్. సమాజంలోని గొప్పవాళ్లను దోచి పేదలకు పంచి పెట్టే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని ఈమూవీ తీశారని తెలుస్తోంది. ఈ సన్నివేశాలు అన్నింటికీ సెన్సార్ వర్గాలు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. ఈమూవీలో శోభిత ధూళిపాళ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఏప్రియల్ రెండవ వారంలో ఈమూవీ విడుదల చేయాలి అని ప్రయత్నిస్తున్న ఈమూవీ నిర్మాతల ప్రయత్నాలు ఎంతవరకు సెన్సార్ అడ్డుకట్టను దాటుకుని వస్తాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: