ఇండియన్ క్రికెట్ టీమ్ లో అత్యంత టాలెంట్ కలిగిన బ్యాటర్ లలో సూర్య కుమార్ యాదవ్ ఒకరు. ఈయన బంతిని బౌలర్ ఏ విధంగా వేసినా కానీ దానిని బౌండరీకి పంపే సామర్థ్యం కలిగిన ఆటగాడు. ఇంత సామర్థ్యం కలిగి ఈ ప్లేయర్ ఇండియన్ క్రికెట్ టీం లో అత్యంత కీలక ఆటగాడిగా మారాడు. ఈయన ఈ మధ్య కాలంలో వరసగా గాయాల పాలు అవుతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈయన కాలికి గాయం అయ్యింది. దానితో చాలా కాలం పాటు విశ్రాంతి తీసుకున్న ఈ స్టార్ బ్యటర్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) లో ఆడుతున్నాడు.

ఇతనికి కొన్ని రోజుల క్రితమే గాయం అయ్యింది. ఇంకా ఆ గాయం తగ్గకపోయినప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు ఇతనితో ఆడిపిస్తోంది. ఇక సూర్య కుమార్ యాదవ్ కూడా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తూ ఫిల్డిన్ మాత్రం చేయడం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో ఈయన బ్యాటింగ్ చేస్తూ ఫీల్డింగ్ చేయకుండా ఉన్న కానీ దాని ప్రభావం ఏ మాత్రం జట్టుపై ప్రభావం చూపడం లేదు. కాకపోతే ఈయన మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే టి20 వరల్డ్ కప్ లో కూడా సెలెక్ట్ అయ్యాడు. కానీ వరల్డ్ కప్ లో మాత్రం అలా కాదు.

అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ ఉండదు. దాని వల్ల ఈయన టి20 వరల్డ్ కప్ లో బ్యాటింగ్ చేసి ఫీల్డింగ్ చేయకుండా ఉండే అవకాశం లేదు. అది ఈయనపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మరి మరి కొంత కాలం లోనే స్టార్ట్ కాబోయే టి20 వరల్డ్ కప్ వరకు ఈయన పూర్తి ఫిట్నెస్ ను సాధించి మ్యాచ్ లోకి దిగుతాడు అని ఇండియన్ క్రికెట్ అభిమానులు మరియు ఈయన అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sky