మిసెస్ ఇండియా పోటీలలో మెరిసి మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. మిసెస్ 2024 పోటీల్లో శృతి చక్రవర్తి సత్తా చాటారు. వృత్తిరిత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న శృతి చక్రవర్తి మిసెస్ ఇండియా నెంబర్ వన్ రన్నర్-అప్ 2024 టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఆమె మిసెస్ ఇండియా నెంబర్ వన్ రన్నరప్ గా నిలవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.
 
ఈ నెల 16వ తేదీన జైపూర్ లో ఈ ఈవెంట్ జరగగా 20 మంది టాలెంటెడ్ కంటెస్టెంట్లతో పోటీ పడిన శృతి తుది పోటీలలో చక్కని ప్రదర్శనతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. శృతి చక్రవర్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిసెస్ ఇండియా పోటీలలో సక్సెస్ సాధించి తన కలను నెరవేర్చుకోవాలని భావించిన ఆమె ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.
 
అటు సాఫ్ట్ వేర్ రంగంలో ఇటు మోడలింగ్ రంగంలో సత్తా చాటిన శృతి చక్రవర్తి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారని చెప్పవచ్చు. భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత ఎదిగి సత్తా చాటుతానని శృతి చక్రవర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వృత్తిలో రాణిస్తూనే కలలను నెరవేర్చుకొని తన సక్సెస్ తో శృతి చక్రవర్తి సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు. ఇంత గొప్ప విజయం సాధించిన శృతి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
 
భవిష్యత్తులో శృతికి టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే శృతి చక్రవర్తి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కెరీర్ పరంగా సత్తా చాటుతున్న హీరోయినలో చాలామంది హీరోయిన్లు మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వాళ్లే అనే సంగతి తెలిసిందే. శృతి చక్రవర్తి సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: