మరి కొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎలక్షన్ లు దగ్గరకు రావడంతో ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలు అయింది . దానితో టికెట్ వచ్చిన రాజకీయ నాయకులంతా నామినేషన్లను వేస్తున్నారు. రానివారు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తున్నారు . ఇకపోతే తాజాగా ఓ సినీ నటి కూడా నామినేషన్ వేసింది. అసలు ఆమె ఎవరు..? ఎక్కడి నుండి పోటీ చేయబోతుంది అనే వివరాలను తెలుసుకుందాం.

పొలిమేర , పొలిమేర 2 సినిమాల్లో కీలక పాత్రలలో నటించిన దాసరి సాహితీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఈ రెండు సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రెండు మూవీ లో తన మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు భారీగా పెరిగాయి. దానితో ఈమె తాజాగా నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

అలాగే సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన సర్కారు నౌకరి సినిమాలో కూడా ఓ పాత్రలో నటించింది. ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీ లో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ మరికొన్ని రోజుల్లో జరగబోయే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఈమె నామినేషన్ ను తాజాగా దాఖలు చేసింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈమె రాజకీయాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో ఎన్నికల్లో ఎన్ని ఓట్లను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ds