అల్లరి నరేష్ తాజాగా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మే 3 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో అల్లరి నరేష్ వరుసగా టీవీ షో లలో , ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ షూటింగ్ చిత్రీకరణ జరుగుతుంది.

ఇందులో నన్ను ఓ కీలకమైన పాత్ర కోసం మేకర్స్ సెలెక్ట్ చేసుకున్నారు అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వార్త అవాస్తవం. నన్ను ఇప్పటి వరకు దేవర యూనిట్ వారు ఎవరు సంప్రదించలేదు. ఇకపోతే ఒక వేళ దేవర యూనిట్ వారు కనుక నన్ను సంప్రదించినట్లు అయితే నేను కచ్చితంగా ఎన్టీఆర్ హీరో గా రూపొందుతున్న సినిమాలో చేస్తాను అని అన్నారు. అలాగే కేవలం ఎన్టీఆర్ అని మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఏ హీరోతో అయినా నటించడానికి నేను రెడీగా ఉన్నాను అని ఈయన చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా అల్లరి నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు మూవీ లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ... మళ్లీ అంకం ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: