వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఆరు నెలల నుంచి ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన పాలనను అందించిన ఈయన మరోసారి అధికారంలోకి వస్తాననే ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా టికెట్ల కేటాయింపులో కూడా  అద్భుతమైన చతురతతో  వ్యతిరేకత ఉన్న స్థానాల్లో అభ్యర్థులను మార్చి  కొత్త అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చారు. ఈ విధంగా ఎక్కడ కూడా  వ్యతిరేక అంశాలు లేకుండా చూసుకొని సింగిల్ గా ఎన్నికల బరిలో నిలబడ్డారు.  ఒక్క జగన్ ను ఓడించడం కోసం 40 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవమున్న చంద్రబాబు జనసేన, బీజేపీ తో జతకట్టారు. 

దీన్ని బట్టి చూస్తే మాత్రం జగన్ కు ఆయన భయపడ్డారని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడైతే కూటమితో జత కట్టారో అప్పుడే జగన్ విజయం సాధించారు.  అలాంటి జగన్ కేవలం రాజకీయాలను కాకుండా శాస్త్రాలను కూడా ఎంతో నమ్ముతారు. క్రిస్టియన్ గా ఆయన కొనసాగుతూనే హిందూ సాంప్రదాయాన్ని కూడా పాటిస్తూ ఉంటాడు. సీఎం అవ్వడం కోసం  ఆయన 41 రోజులపాటు  యాగాన్ని చేయించాడు. ఆ యాగమే తనను గెలిపిస్తుందని  ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.  తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసంలో గత 41 రోజులుగా రాజ శ్యామల చండీయాగం జరుగుతోంది. దీనిలో భాగంగానే హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు పండితులు.

వైసిపి ప్రభుత్వం మరోసారి ఏర్పడాలని ప్రజాహిత పాలన కొనసాగించాలని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించారట. అలాంటి ఈ మహా యాగం  ఇవాల్టితో ముగిసింది. ఈ రాజ శ్యామల సహస్ర చండీయాగాన్ని  నల్లపెద్ది శివరామ ప్రసాద శర్మ ,నాగేంద్ర శర్మలు నిర్వహించారట. ప్రస్తుతం ఈ యాగం ముగియడంతో శాస్త్ర పండితులంతా జగన్ ను దీవించారు.  తప్పనిసరిగా మరోసారి సీఎం పీఠం ఎక్కి ప్రజలకు శ్యామలమైన పాలన అందిస్తారని ఆశీర్వదించారు. దీంతో ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో చండీయాగం ముగిసింది ఇక జగన్ సీఎం అవ్వడమే మిగిలి ఉంది అంటూ జగన్ అభిమానులంతా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: