గత ఆరు నెలల నుంచి ఏపీలో హారహోరి ఎన్నికల ప్రచారం జరిగింది. మే 13న ఈ ప్రచారానికి ఎండ్ కార్డు పడింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో నేతలు ఏ విధంగా ప్రచారం చేశారో  ఆ విధంగానే ఓటర్లు కూడా ప్రభావితం చెంది వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలలోకి జనాలు తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేశారు. ఈ అత్యధిక ఓటింగ్ ఏ పార్టీకి ప్లస్ కానుంది, ఏ అభ్యర్థికి మైనస్ కానుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇదే తరుణంలో ఓవైపు టీడీపీ కూటమి మరో వైపు వైసిపి   వారి వారి సొంత సర్వేలు చేయించుకున్నది. 

 ఈ సర్వేలో కొన్ని సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తుంది అంటే, మరికొన్ని సర్వేలు టిడిపి అధికారంలోకి వస్తుంది అని చెబుతున్నాయి. కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది క్లారిటీగా చెప్పడం లేదు. ఇక ఇందులో జగన్ మాత్రం తప్పక మరోసారి సీఎం అవుతారని వైసీపీ అధికారంలోకి వస్తుందని  గట్టిగా చెప్పారు. అయితే దీనికి ఒక కారణం కూడా ఉందట  ఆయన ఇంటర్నల్ గా ఇప్పటికే ఒకటి రెండు సార్లు సర్వేలు కూడా చేయించారట. ఈ సర్వేలో ఆయనే మళ్లీ అధికారంలోకి రాబోతున్నారని తెలిసింది. ఇదే తరుణంలో ఏపీలో ఆ మాజీ సీఎం కూడా ఓటమిపాలవుతున్నారని తెలిసిందట. ఆయన ఎవరు ఆ వివరాలు చూద్దాం..

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  ఓవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోటీలో ఉండగా, మరోవైపు ఇద్దరు మాజీ సీఎంలు కూడా ఈసారి బరిలో ఉన్నారు.  ఇందులో కుప్పం నుంచి చంద్రబాబు పోటీలో ఉండగా, కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పార్లమెంటు బరిలో ఉన్నారు. ఇదే తరుణంలో ఒక మాజీ సీఎం ఓడిపోబోతున్నారని వైసీపీ సర్కిల్లో ఒక వార్త చక్కర్లు కొడుతుందట. ఇందులో ఒక మాజీ సీఎం తన సొంత నియోజకవర్గం లోనే ఓటమి పాలవుతున్నారని నివేదిక అందిందట. ఇందులో కుప్పం నుంచి చంద్రబాబు ఓడిపోతున్నారా లేదంటే  రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతున్నారా అనేది మరోసారి క్రాస్ చెక్ చేసే పనిలో పడ్డారట వైసిపి నాయకులు.  మరి చూడాలి జూన్ 4వ తేదీన ఇందులో ఎవరు ఓడిపోతారు ఎవరు  గెలుస్తారు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: