పోలింగ్ ముగిసింది. ఓటింగ్ శాతం పెరగింది.  ఇది ఎవరికి లాభం. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి. ఏ అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలుస్తారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే చర్చలు. దాదాపు మూడు నెలల నుంచి అభ్యర్థులు విశ్రాంతి లేకుండా పార్టీ కార్యక్రమాల్లో, ప్రచారాల్లో ముగిగితేలారు. రాత్రి, పగలు తేడా లేకుండా కేడర్ తో కలిసి పనిచేశారు.


వీరంతా సోమవారం రాత్రి 12 గంటల తర్వాత కంటి నిండా కునుకు తీశారు. తిరిగి మంగళవారం ఉదయం నుంచి పార్టీ క్యాడర్ తో కూర్చొని గెలుపు ఓటములపై సమీక్షలు ప్రారంభించారు. మండలం, గ్రామ, వార్డు ల వారీగా పోలింగ్ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎవరికీ విజయం వస్తుంది అనే దానిపై అయితే ఒక అంచనాకు వచ్చారు. కొందరు తమదే విజయం అనే ధీమాతో ఉన్నారు.


కానీ ఈ సారి ఏపీ ఎన్నికల్లో వేవ్ కనిపించలేదు అని విశ్లేషకులు చెబుతున్నా.. వారి నాడీ పసిగట్టడంలో అందరూ విఫలం అయ్యారని అర్థం అవుతుంది. ఎందుకంటే.. దాదాపు గత ఎన్నికలకు మించి ఈ సారి పోలింగ్ నమోదు అయింది. ఇక 2019 ఎన్నికలకు ముందు అంటే ఏడాది నుంచే వైసీపీకి పాజిటివ్ వేవ్స్ కనిపించాయి.


ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ చూసుకున్నా కూడా కాంగ్రెస్ గాలి వీస్తోంది అనే వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఇప్పుడు ఏ రకమైన సంకేతాలు కనిపించడం లేదు. ఒక్కటి మాత్రం నిజం. ఏపీలోని మూడు పార్టీల నాయకులు మాత్రం కడదాకా పోరాడారు. ఎంతలా అంటే చేతులెత్తేయకుండా.. ప్రచారం దగ్గర నుంచి.. పోల్ మేనేజ్ మెంట్ వరకు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాయి.  ఏడు పదుల దాటిన వయసులోను చంద్రబాబు మంటుడెండను, వర్షాన్ని లెక్క చేయకుండా తడుస్తూ, చెమటలు గక్కుతూ ప్రచారం చేశారు. ఇక జగన్ కూడా అంతే. తన శక్తినంతా ధారపోశారు. పవన్ అస్తవస్థకు గురైనా ప్రచారాన్ని ఆపలేదు.  గెలుపు ఓటమనులను పక్కన పెడితే మొత్తం మీద ఏపీలో అద్భుత ఫైట్ నడిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: