ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు టిడిపి ,వైసిపి, జనసేన మధ్య అన్నట్లుగా హోరాహోరిక సాగాయి.. అయితే ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మెగా మరియు అల్లు ఫ్యామిలీ మధ్య ఒక వార్ మొదలైనట్టుగా సమాచారం. ఎన్నికలలో చివరి రోజు భాగంగా అల్లు అర్జున్ వైసీపీ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. దీంతో నంద్యాల పర్యటన కూడా చేయడం జరిగింది. ఇలా అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో మెగా అభిమానులకు జనసైనికులకు కాస్త ఈ విషయం షాక్కు తగిలింది.


ఒకపక్క పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ పైన యుద్ధం చేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ వైసీపీ పార్టీ లో లీడర్ కి సపోర్ట్ చేయడంతో మెగా అభిమానులు జనసేన కార్యకర్తలు ఆగ్రహాన్ని తెలిపారు. ఎన్నికల అయిపోయిన తర్వాత నాగబాబు ఒక సంచలన ట్విట్ చేశారు.. మాతో ఉంటూ ప్రత్యర్థులకే పని చేసేవాడు మావాడు అయిన.. పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే అంటూ నాగబాబు ఒక ట్విట్ చేశారు.. ఇది చూసిన నేటిజన్స్ అంతా కూడా నాగబాబు అంటున్నది కేవలం అల్లు అర్జున్ ని అంటూ తెలియజేశారు.

ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయంశంగా మారింది. తాజాగా ఈ విషయం పైన రీసెంట్గా వైసీపీ నేత రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగబాబు గారు ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారన్నది అర్థం కావడం లేదని ఒకవేళ తన స్నేహితుడు బన్నీని ఉద్దేశించే అలాంటి ట్వీట్ చేసి ఉంటే అది ఆయన సంస్కారానికి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. ఎందుకంటే స్నేహితులంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు ఉంటారు.. బన్నీ రాజకీయాలకు.. కేవలం ఒక మిత్రుడు కోసం మాత్రమే వచ్చారు. ఈ విషయాన్ని బన్నీ కూడా చెప్పారు.. అయినా కూడా నాగబాబు తన స్నేహితుని ఉద్దేశించే ట్విట్ చేస్తే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తానంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: