ఈ మధ్య కాలంలో బాగా చర్చ జరిగిన నియోజకవర్గాలలో డోన్ కూడా ఒకటి కావడం గమనార్హం. కూటమి తరపున కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వైసీపీ తరపున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేయడంతో టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎన్నికల సమయానికి పరిస్థితి మారిపోయిందని బుగ్గన విజయం పక్కా అని తెలుస్తోంది. ఓటుకు నోటు పంపిణీ కూడా బుగ్గనకు బాగా కలిసొచ్చిందని సమాచారం అందుతోంది.
 
డోన్ నియోజకవర్గంలో గెలుపు విషయంలో వైసీపీకి ఆశలు సజీవంగా ఉండగా కూటమి ఆశలు వదులుకుందని తెలుస్తోంది. డోన్ లో వైసీపీకి తిరుగులేదని సమాచారం అందుతోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం బుగ్గన రాజేంద్రనాథ్ ఎంతో కష్టపడ్డారని ఆ కష్టమే ఆయనకు ప్లస్ కానుందని భోగట్టా. ఈ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ సీట్లను ఇచ్చే జిల్లా కర్నూలు అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని తెలుస్తోంది. పల్లె ప్రజలు ప్రధానంగా బుగ్గనను నమ్ముతున్నారని 2019 మెజారిటీని మించి ఈ ఎన్నికల్లో బుగ్గనకు మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బుగ్గన ఈ ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఇక్కడి స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
 
స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా బుగ్గనకు వరం అవుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుగ్గన లాంటి నేత ఉంటే మాత్రమే డోన్ శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని డోన్ ప్రజలు చెబుతున్నారు. బుగ్గన ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం డోన్ ప్రజలకు మరింత మంచి జరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. జగన్ సైతం డోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు కీలక హామీలను ఇచ్చినట్టు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: