ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందినవారు అందరూ వివిధ రంగాల్లో రాణిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మొన్నటి వరకు ఈ తరహాలో కేవలం వెండి తెర నటీనటులు మాత్రమే నడిచేవారు. కానీ నేటి కాలంలో బుల్లితెరకు చెందిన సీరియల్ నటీనటులు కూడా తమకి నచ్చిన రంగంలో రాణిస్తున్నారు. యాక్టింగ్ ని ఫ్యాషన్ గా ఉంచుతూనే మరో పక్క పాలిటిక్స్ లేదా ఇతర బిజినెస్ లో రాణిస్తున్నారు. అలా రాణిస్తున్న వారిలో బుల్లితెర నటి శ్యామలా కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె వైసిపి పార్టీకి అండగా నిలబడిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ని గెలిపించేందుకు సర్వవిధాలుగా ప్రయత్నిస్తుంది ఈ నటి. ఇక తాజాగా ఈ నటి భర్త పై వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి వాటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బుల్లితెర యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకమైన సంబోధన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి పరిచయమై మంచి గుర్తింపును సంపాదించుకుంది.లయ, గోరింటాకు, అభిషేకం వంటి సీరియల్స్ లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక అనంతరం యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి పలు సోషల్ ప్రోగ్రామ్స్ మరియు సినిమా ఈవెంట్స్ కి యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అయితే శ్యామల గత కొద్ది కాలంగా సినిమాలు చేస్తూ యాంకరింగ్ కు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టి బిజీ బిజీ లైఫ్ ను కొనసాగిస్తుంది. ఇక ఈ క్రమంలోనే.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన ఆపోజిట్ పార్టీపై ఘోర విమర్శలు చేసింది.

దీంతో ఆపోజిట్ పార్టీ వాళ్లు ఈమె కెరీర్ గురించి ఈమె భర్త లైఫ్ స్టైల్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక నేడు అనగా మే 5వ తారీఖున తన భర్త పక్క ఆధారాలతో పోలీసులకు చిట్టాడు. సీరియల్ యాక్టర్ శ్యామల భర్త నరసింహ పై రాయి దుర్గ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయింది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ యువకురాలు కంప్లైంట్ ఇచ్చింది. 2017 నుంచి ఇప్పటివరకు విడుదల భారీగా డబ్బు తీసుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. ఇక డబ్బుల గురించి అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడినట్లు.. డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఆ మహిళ కంప్లైంట్ చేసింది.
ఇక ఈ విషయాన్ని సెటిల్మెంట్ చేసుకోవాలంటూ.. నరసింహారెడ్డి తరుపున మరో లాయర్ సపోర్ట్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తనకి మద్దతుగా నిలిచిన వారంతా వైసిపి కార్యకర్తలు అయినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..” ఇప్పుడు వాళ్ల టైం నడుస్తుంది. కనుక మీరు వాడిని అరెస్ట్ చేసిన ఎటువంటి ఉపయోగం ఉండదు. అందువల్ల వాడిని మీరు ఏమి చేయలేరు. వాడు ఇప్పుడే బయటకు వచ్చి ప్రచారం చేపట్టాడు. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళ ఆవిడ ప్రచారంలో దిగింది. అటువంటిది వాళ్ళ ఆయన్ని ఆ కోటి రూపాయలు ఇచ్చి కాపాడుకోలేదా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: