సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారిపోతాయి అని ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారు స్టార్లుగా ఎదిగితే.. భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారు ప్రేక్షకులను మెప్పించలేక చివరికి కనబరుగైపోవడం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాతో.. మరో హీరో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ హీరోగా ఎదగడం కూడా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సార్లు జరిగింది. అయితే సరైన సినిమాలు పడకపోతే హీరోలు మాత్రమే కాదు డైరెక్టర్లు కూడా ఇండస్ట్రీలో కనుమరుగు అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా ఒకప్పుడు ఎంతోమందిని స్టార్ హీరోలుగా మార్చి కెరీర్ నిలబెట్టిన డైరెక్టర్ ఇక ఇప్పుడు ఇలాగే ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఆయన ఎవరో కాదు పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాద్. మూడు నెలలలోనే సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్లు కొట్టగల సత్తా పూరి జగన్నాథ్ సొంతం అని చెప్పాలి. ఇక అందరూ హీరోలకు దాదాపు బ్లాక్ బస్టర్లు ఇచ్చేసాడు ఈ డైరెక్టర్. అయితే పూరి జగన్నాథ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా ఇడియట్. రవితేజ హీరోగా వచ్చిన ఈ మూవీ ఎంత మంచి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇటీవల కాలంలో పాత సినిమాలకు సీక్వెల్ సినిమాలు తీసే ట్రెండు నడుస్తూ ఉండడంతో ఇడియట్ సినిమాకి కూడా సీక్వెల్ వస్తే ఎంత బాగుండు అని అభిమానులు కోరుకున్నారు. అయితే ఇప్పుడు అభిమానుల కోరికను నిజం చేయబోతున్నడట డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇడియట్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. అయితే ఈ మూవీలో శ్రీ లీలను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. అయితే ఒకప్పుడు రవితేజ హీరోగా నటించిన సినిమాకు సీక్వెల్ లో ఇక ఎప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నా హీరో తేజ సజ్జను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తేజ సజ్జ పూరి జగన్నాథ్ తో ఒక మూవీ చేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఆ మూవీ ఇదే అంటూ ఇప్పుడు అభిమానులు కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: