కోలీవుడ్ నటుడు విశాల్ పోయిన సంవత్సరం మార్క్ ఆంటోనీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. ఈ సినిమాతో విశాల్ కు సూపర్ సాలిడ్ విజయం దక్కింది. ఇలా మార్క్ ఆంటోనీ మూవీ తో అద్భుతమైన విజయం అందుకున్న ఈ హీరో ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరి దర్శకత్వంలో రూపొందిన రత్నం అనే సినిమాలో హీరో గా నటించాడు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ ఓ కీలకమైన పాత్రలో నటించింది. సముద్ర ఖని , మురళి శర్మమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. మార్క్ ఆంటోనీ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత విశాల్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. దానితో ఈ మూవీ కి భారీ మొత్తంలో నష్టాలే తెలుగు రాష్ట్రాల్లో మిగిలాయి.

మరి ఈ మూవీ కి ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఎన్ని కోట్ల నష్టాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి నైజాం ఏరియాలో 78 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఆంధ్ర ప్రదేశ్ లో 1.06 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.84 కోట్ల షేర్ ... 4.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ కి దాదాపుగా 2.66 కోట్ల మేర రెండు తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: