ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అందించిన హిట్ చిత్రాల్లో ఒకటి అరుంధతి. 2009లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మల్లెమాల ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెరకెక్కించారు.ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా..థియేటర్ల దగ్గర కోట్లు కుమ్మరించింది. రూ. 13 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. 70 కోట్లు వసూలు చేసింది. అనుష్క శెట్టి, దీపక్, సోనూ సూద్, షాయాజీ షిండే, సత్యనారాయణ, మనోరమ తదితరులు కీలక పాత్రలు పోషించారు.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటీ బాణీలు సమకూర్చారు. ఈ సినిమాతో అనుష్క ఫేటే మారిపోయింది. అప్పటి వరకు గ్లామరస్ పాత్రల్లో మెరిసిన స్వీటీని ఇందులో జేజమ్మగా చూసి తమ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. ఇందులో అనుష్క డ్యూయల్ రోల్ పోషించింది.

ఇక సోనూసూద్ యాక్టింగ్ చూసి.. కరోనా ముందు వరకు భయపడిన వారే. పశుపతి.. అఘోరా పతి అంటూ రవి శంకర్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ సినిమాలో ప్రతి సీన్ ఓ ఆణిముత్యమే.. అక్కను చిత్ర వధ చేసి చంపిన బావ పశుపతి అఘోరాగా మారి.. తనను కొట్టిన ఊరిపై దాడి చేసేందుకు వస్తుంటాడు. అప్పుడు అరుంధతి పెళ్లి జరిగి ఉంటుంది. చిన్నప్పుడు చూసిన జేజమ్మ.. పెళ్లీడు వచ్చేసరికి అందగత్తెగా తయారవ్వడం చూసిన పశుపతి.. 'పిందె పండయ్యింది' అంటూ విలన్ చెప్పే డైలాగ్ మెస్మరైజ్ చేస్తుంటుంది. అప్పటి అరుంధతికి, ఆమె మనవరాలికి ముడిపెడుతూ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. కొన్ని సీన్లను అలా తెరకెక్కించాడు. పశుపతిని సమాధి చేసిన పాత పడిన బంగ్లాలోకి వెళ్లి మనవారిలి ఒంట్లోకి అరుంధతి వచ్చి.. నువ్వు..నన్ను ఏం చేయలేవురా అనే డైలాగ్ కేక పుట్టిస్తుంది. అరుంధతి పూనినట్లు చూపిస్తుంటాడు.

ఇదిగో ఇప్పుడు అలాంటి సీన్ సినిమాలో నుండి డిలీట్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సీన్ ఉంటే.. మూవీ వేరే లెవల్ ఉండటం ఖాయం. అరుంధతి ఎంతటి వీర వనితే తెలిసేలా ఆ సీన్ ఉంది. అదే సన్నివేశం.. విలన్ చంపే సీన్‌కు లింక్ ఉంది. ఇంతకు ఆ సీన్ ఏంటంటే..? వంటగదిలో ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటుంది అనుష్క. అక్కడ పెద్ద మంటపై ఓ బాణీలో నూనె కాగుతూ ఉంటుంది. అంతలో అక్కడకు ఓ చిన్నారి వచ్చి.. పొయ్యి పక్కనే ఉన్న చెక్కపై పెట్టిన పిండిపదార్థాలను తీసుకునేందుకు పైకి ఎక్కుతుంది. అంతలో స్లిప్ అయ్యి.. నూనెలో పడబోతుంటే.. వెనుక నుండి అనుష్క కత్తి విసిరి.. పాప చొక్కాకు తగిలి.. వేలాడేలా చేస్తుంది. దీంతో పాప నూనెలో పడదు. దీంతో మనోరమ.. గతంలో సోనూసూద్ ను చంపి.. అతడు మంత్రాలు చదవకుండా ఉండేందుకు.. నోటిలో కత్తి దింపే సీన్ రిలేటెడ్ గా భావిస్తుంది. అరుంధతిలో డిలీటెడ్ సీన్.. 15 ఏళ్ళ తరువాత చూసినా అదిరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: