శివాజీ బిగ్ బాస్‌లోకి వెళ్లున్నాడు అని అన్నప్పుడు.. హో వాడా?? ఒక్క వారం కంటే ఎక్కువ ఉండడు.. వాడి టెంపర్‌‌కి.. టీడీపీ పార్టీపై ఉన్న పిచ్చికి.. వైసీపీ పార్టీపై ఉన్న ద్వేషానికి ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తాడు. అయినా వాడేంటి బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడం ఏంటి?? అబ్బబ్బే పని కాదు అని పెదవి విరుపులు వినిపించాయి.కానీ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తరువాత తనలోని కొత్త కోణాన్ని చూపించారు శివాజీ. ఐదు వారాలు అయ్యేసరికి.. ఎవరైతే.. వీడు ఒక్కవారం కూడా ఉండరని అన్నవాళ్లే.. టాప్ 5లో ఎవరు ఉన్నా లేకపోయినా.. శివాజీ మాత్రం ఉంటాడ్రా అని బల్లగుద్ది మరీ చెప్తున్నారంటే.. శివాజీలో ఏ రేంజ్‌లో మార్పు ఉందో గమనించవచ్చు.హీరో 90 సినిమాలకు పైగా చేసిన శివాజీ.. బిగ్ బాస్‌కి వెళ్లడమే పెద్ద సర్ ప్రైజ్ అంటే.. బిగ్ బాస్ అతను టాప్ కంటెస్టెంట్స్ అవ్వడం అంతకుమించిన సర్ ప్రైజ్.శివాజీకి బిగ్ బాస్ తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు బిగ్ బాస్ చూడని వాళ్లు కూడా శివాజీ కోసం బిగ్ బాస్ అలవాటు చేసుకున్నారంటేఏ రేంజ్‌లతో తన ఆటతీరు, మాటతీరుతో మెప్పించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీజన్ 7 హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్‌లలో శివాజీ చాలా పెద్దొడు. అలాంటిది కుర్ర కంటెస్టెంట్‌లను కూడా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లలో ఓడించడం వంటివి బుల్లితెర ఆడియెన్స్‌కు శివాజీని దగ్గర చేశాయి. అంతేకాదు శివాజీ ముక్కుసూటి మనిషి. ఎదుటివారు ఏమనుకున్నా సరే తను చెప్పాల్సింది మాత్రం చెప్పేస్తాడు. తోటి కంటెస్టెంట్‌లు తప్పు చేస్తే.. అది తప్పు అని వేలెత్తి చూపుతాడు. అలాగే హౌజ్‌లో ఎవరైన కుంగిపోతే వాళ్లకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇవన్నీ శివాజీకి బుల్లితెర ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి.

అంతేందుకు.. సామాన్యుడిగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అసాధ్యం అనుకున్న టైటిల్‌ను సుసాధ్యం చేసిన పల్లవి ప్రశాంత్‌ గెలుపులో తన పాత్ర ఎంతో ఉంది. తొలి రెండు, మూడు వారాల వరకు పల్లవి ప్రశాంత్‌ను ట్రోల్ చేసిన ఆడియెన్స్ ఆ తర్వాత తనకు సపోర్ట్ చేస్తూ విన్నింగ్ టైటిల్ కొట్టేలా చేశారు. శివాజీ ఇచ్చిన సలహాలు, సూచనలే తనను టైటిల్ విన్నర్‌గా చేసిందని పల్లవి ప్రశాంత్ కూడా స్వయంగా చెప్పుకొచ్చాడు. అందుకే ప్రశాంత్ తనకు సంబంధించిన ఎలాంటి చిన్న అకేషన్ అయినా శివాజీ ఉండాల్సిందే. శివాజీని ఒక అన్నలా భావిస్తుంటాడు. నిజానికి శివాజీనే సీజన్ 7 టైటిల్ విన్నర్ అని అందరూ అనుకున్నారు.. అదీ కాకపోయినా రన్నరప్‌గా నిలుస్తాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రెండో రన్నరప్‌గా నిలిచాడు.బిగ్ బాస్ చివరి టైమ్‌లో శివాజీపై కాస్త నెగెటివిటీ ఏర్పడడమే మూడో స్థానానికి పరిమితం చేసింది పలువురు బిగ్ బాస్ ప్రియులు అభిప్రాయ పడ్డారు. పల్లవి ప్రశాంత్‌ను ముందుకు పంపడంలో అమర్ దీప్‌ను వెనకకు నెట్టాడని పలువురు ఆ టైమ్‌లో విమర్శలు కూడా చేశారు. ఏది ఏమైనా సీజన్ 7లో శివాజీ చూపించిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పుడదే తనకు బంపర్‌ ఆఫర్ తెచ్చిపెట్టిందని ఇన్ సైడ్ టాక్. అదేంటంటే.. సీజన్ 7 సూపర్ సక్సెస్ అవడంతో, సీజన్ 8ను వీలైనంత తొందరగా స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కంటెస్టెంట్‌ల ఎంపిక కూడ ప్రారంభమైపోయిందని టాక్. అన్ని కుదిరితే ఆగస్టు నెలలోనే బిగ్ బాస్ సీజన్-8 ప్రారంభం కానుంది.కాగా బిగ్ బాస్ సీజన్ 8 బజ్ హోస్ట్‌గా శివాజీని నిర్వాహకులు ఎంపిక్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్. బిగ్ బాస్ బజ్ అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని.. హౌజ్‌నుంచి బయటకు రాగానే ఇంటర్వ్యూ చేస్తారు. లాస్ట్ సీజన్‌లో ఈ షోకు హోస్ట్‌గా గీతూ రాయల్ చేసింది. ఇక 8వ సీజన్ కోసం శివాజీని తీసుకురావడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.ఇక సీజన్ 8 కోసం ఇప్పటివరకు రాజ్ తరుణ్, బర్రెలక్క, హేమ, సురేఖ వాణితో పాటు తన కూతురు, కిరాక్ ఆర్పీ, బమ్ చిక్ బబ్లూ వంటి పేర్లు లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: