ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమా కు సంబంధించి, స్క్రిప్ట్ వర్క్ ఈ మధ్యే పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. దీంతో త్వరలోనే ఈ సినిమా ను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే అంతకు ముందే బిగ్ ప్లాన్ రెడీ చేశారు జక్కన్న.ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా గురించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు జక్కన్న. అంతేకాదు ఈ లోగా కాస్టింగ్‌ను ఫైనల్ చేసి అదే వేదిక మీద కాస్ట్ అండ్ క్రూ డిటైల్స్ కూడా వెల్లడించే ఆలోచనలో ఉన్నారు. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ తరువాత ఆరు నెలల పాటు కాస్ట్ అండ్ క్రూతో వర్క్‌షాప్ కండక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.వర్క్ షాప్ కూడా పూర్తయిన తరువాతే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే 2025 ఫస్ట్ కార్వర్ట్‌లో ఎస్ఎస్ఎంబీ 29 సెట్స్ మీదకు వెళుతుంది. యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఇంతవరకు ట్రై చేయని డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు మహేష్. ఈ సారి నేషనల్ లెవల్‌లో కాదు గ్లోబల్ లెవల్‌లో కాస్టింగ్ సెట్ చేస్తున్నారు జక్కన్న.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి