టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ గా.. ఎనర్జిటిక్ స్టార్ గా..పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని ఇప్పటికే 40 ఏళ్లకు దగ్గర పడుతున్నాడు. అయినా కూడా పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పడం లేదు. ఆయన కూడా ప్రభాస్ బాటలో వెళ్తున్నాడా ఏమో తెలియదు కానీ పెళ్లి చేసుకోవడం లేదు అని ఇప్పటికే ఈయనను చాలా మంది  ట్రోల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే రామ్ పోతినేని పెళ్ళంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. రామ్ పోతినేని తన చిన్ననాటి స్నేహితురాలని పెళ్లి చేసుకోబోతున్నాడు అని కొంతమంది పుకారు పుట్టిస్తే మరికొంతమందేమో హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాశారు. ఇంకొంతమంది బిజినెస్ మాన్ కూతుర్ని పెళ్లాడబోతున్నారని ఇలా ఎన్నో వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా రామ్ పోతినేని గురించి ఇలాంటి న్యూసే మరొకటి వైరల్ అవుతుంది. రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట.మరి అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. దేవదాసు మూవీతో తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని ఆ తర్వాత వరుస హిట్స్ తో దూసుకుపోయారు. అయితే ఒకానొక సమయంలో రామ్ పోతినేని సినీ కెరీర్ పూర్తిగా అయిపోయింది అనుకునే సమయంలోనే ఇస్మార్ట్ శంకర్ మూవీ మళ్లీ ఆయనను ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకునేలా చేసింది.ఇక ఆ తర్వాత వచ్చిన రెడ్,ది వారియర్ వంటి రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.ఇక స్కంద మూవీ ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ వావ్ అనేంతలా మాత్రం లేదు.

ఇక ప్రస్తుతం రామ్ పోతినేని ఆశలన్నీ డబుల్ ఇస్మార్ట్ మూవీ పైనే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది.అయితే తాజాగా సెప్టెంబర్ లో రామ్ పోతినేని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టు ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మాన్ కూతురిని రామ్ పోతినేని పెళ్లాడబోతున్నారట. మరి ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియాలంటే రామ్ పోతినేని కచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు ఆయన అభిమానులు.అయితే ఇప్పటికే ఎన్నోసార్లు తనపై వచ్చిన పెళ్లి రూమర్స్ ని ఖండించారు రామ్ పోతినేని.మరి ఈ పెళ్లి వార్తను ఖండిస్తారా లేక గుడ్ న్యూస్ చెబుతారా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: