అంతేకాదు తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకొని.. నేటితరం ప్రేక్షకులకు సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు మహేష్. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు అని చెప్పాలి. కొంతకాలం నుంచి వరుసగా సూపర్ హిట్ లు కొడుతూ దూసుకుపోతున్నాడు. అయితే ఇక మహేష్ బాబు వారసుడిగా గౌతం ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ ఏకంగా తండ్రి లాగానే హైట్ పెరిగి ఎంతో హ్యాండ్సమ్ గా మారిపోయాడు. ఫిట్నెస్ ని కూడా మైంటైన్ చేస్తున్నాడు. దీంతో గౌతమ్ ఎంట్రీ గురించి ఘట్టమనేని ఫ్యాన్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు తనయుడు గౌతంను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ తనకు వస్తే బాగుండు అని డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాల నటుడిగా ఉన్నప్పుడే మహేష్ బాబు సూపర్ స్టార్ అవుతారని తాను ఊహించానని ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో తెలిపాడు. మహేష్ తో యువరాజు సినిమా చేయడం తన అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కావాలనే మహేష్ ను రిక్వెస్ట్ చేసి మరి సినిమాలో కృష్ణుడి పాత్ర వేయించినట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు మహేష్ తనయుడు గౌతమ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ తనకు వస్తే తప్పకుండా చేస్తానని.. అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అంటూ వైవిఎస్ చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.