అప్పట్లో ఒరు ఆధార్ లవ్ అనే మూవీ టీజర్ రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సాధించింది. ఆ మూవీ ద్వారా కుర్ర హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యి ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. ఒక్క టీజర్ ప్రియా ప్రకాశ్ కెరీర్‌నే మార్చేసిందని చెప్పాలి. అయితే ఆ మూవీ మాత్రం అంతగా ఆడలేదు. కానీ ప్రియాకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో కెరీర్‌లో కాస్త వెనకబడింది. తనకొచ్చిన ఆ క్రేజ్‌ను ప్రియా ప్రకాశ్ వారియన్ కాపాడుకోలేకపోయిందని చెప్పాలి.

ఒరు ఆధార్ లవ్ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ వాటన్నింటినీ ఆమె రిజెక్ట్ చేసింది. తనకు స్టార్ ఛాన్సులు కావాలనే రూల్ పెట్టడంతో అప్పటి వరకూ ఆమెతో సినిమా చేయాలనుకున్నవారంతా సైడ్ చేసేశారు. ఇక ఆఖరికి నితిన్‌తో చెక్ మూవీ, తేజ సజ్జాతో ఇష్క్ మూవీలో నటించింది. ఆ మూవీస్ కూడా వర్కౌట్ కాలేదు. ఇక టాలీవుడ్ ఆశలు ఆవిరయ్యాక గత ఏడాది బ్రో మూావీలో సాయిధరమ్ తేజ్ చెల్లెలుగా నటించాల్సి వచ్చింది.  

క్రేజ్ ఉన్నప్పుడు టాలీవుడ్ నుంచి వచ్చిన ఛాన్సులు మిస్ చేసుకోవడంతో ఆతర్వాత ప్రియా ప్రకాశ్ వారియర్ అరకొర సినిమాలు చేయాల్సి వచ్చింది. అయితే వరుస ఫోటో షూట్స్ చేస్తూ తన ఫ్యాన్స్‌కు మాత్రం దగ్గరగా ఉంటోంది. సోషల్ మీడియాలో తన ఫోటోస్ షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు కావాల్సినంత వినోదాన్ని ఇస్తోంది. తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ శారీతో చేసిన ఫోటో షూట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మిర్చి క్యాప్షన్‌తో చీరలో అందాలను ప్రియా ప్రదర్శించింది. ఇలాగైనా తనకు సినిమా ఛాన్సులు రావాలని చూస్తోంది. సౌత్ సంగతి అటుంచితే హిందీలో మాత్రం ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ కొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వింక్ బ్యూటీకి సినిమా ఛాన్సులు బాగా వచ్చి మళ్లీ క్రేజ్‌ను సొంతం చేసుకోవాలని ప్రియా ప్రకాశ్ వారియర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: