అదే సమయంలో మొదటినుంచి ఎంతో పవర్ఫుల్ గా కనిపించే పుష్పరాజ్ పాత్రనే భయపెట్టించిన బన్వర్సింగ్ శకవత్ పాత్రలో నటించిన ఫహద్ ఫాసిల్ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఇలా పుష్పరాజ్ పాత్ర మాత్రమే కాకుండా శ్రీవల్లి షేకావత్ పాత్రలో కూడా పుష్ప సినిమాకు ఎంతో కీలకం. ఇక ఇప్పుడు నేడు రిలీజ్ అయిన పుష్ప-2 సినిమాలో కూడా వీరిద్దరి పాత్రల చుట్టే అటు సినిమా మొత్తం తిరుగుతుంది. భార్య ఆనందం కోసం ఏమైనా చేసే పుష్పరాజ్.. పుష్ప రాజ్ మీద పగ ప్రతీకారాలతో రగిలిపోయే బర్మరసింగ్ శకావత్ ఇదే పూర్తిగా సినిమా మొత్తం ఉంటుంది అని చెప్పాలి.
అయితే ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సహా అటు శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక, శకావత్ పాత్రలో నటించిన ఫహద్ ఫాసిల్.. వీళ్లు తప్ప ఆ పాత్రల్లో మరొకరు నటించి ఉంటే ఆ సినిమాలో ఆ పాత్ర అంత బాగా క్లిక్ అయ్యేది కాదు అని ప్రేక్షకుల భావన. కానీ అల్లు అర్జున్ కోసం కథ రాసుకున్న సుకుమార్ అటు శ్రీవల్లి, శకావత్ పాత్రల కోసం మాత్రం ముందుగా వేరే నటులని అనుకున్నారట. టాలీవుడ్ లో వినిపించే టాక్ ప్రకారం... శ్రీవల్లి పాత్ర కోసం ముందుగా సమంతను తీసుకోవాలని అనుకున్నాడట. కానీ ఆమె బిజీగా ఉండడంతో రష్మికను ఎంపిక చేశారు. చివరికి సమంతను ఎలాగైనా సినిమాలో భాగం చేయాలని ఐటమ్ సాంగ్ చేయించాడు సుకుమార్. ఇక ఆ తర్వాత బన్వర్సింగ్ షెకావత్ పాత్ర కోసం విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నాడట. ఆయన డేట్స్ కూడా ఖాళీ లేకపోవడంతో చివరికి ఫహద్ ఫాసిల్ ను తీసుకున్నాడు సుక్కు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి