ఏ హీరోకు అయినా ఇండస్ట్రీ లో స్టార్ హీరో ఈమేజ్ రావాలి అంటే ఆయనకు ముఖ్యంగా కావాల్సింది బ్లాక్ బాస్టర్స్. ఏ హీరో కు అయితే బ్లాక్ బస్టర్ విజయాలు దక్కుతాయో వారు స్టార్ హీరో స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో మోహన్ బాబు ఒకరు. ఇకపోతే మోహన్ బాబు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరో గా నటించాడు. అలా మోహన్ బాబు నటించిన కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను చిరంజీవి రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మోహన్ బాబు హీరో గా రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సినిమాలలో అసెంబ్లీ రౌడీ మూవీ ఒకటి. ఈ మూవీ ని మొదట ఈ మూవీ బృందం వారు చిరంజీవి తో చేయాలి అనుకున్నారట. అందులో భాగంగా ఆయనను సంప్రదించి కథను కూడా వివరించారట. కానీ చిరంజీవి మాత్రం అసెంబ్లీ రౌడీ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదట. దానితో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా కథను మోహన్ బాబు కు వివరించగా , ఆయన మాత్రం ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. మోహన్ బాబు కెరియర్లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న సినిమాలలో అల్లరి అల్లుడు మూవీ ఒకటి. ఇకపోతే ఈ సినిమాను మొదట రాఘవేందర్రావు చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట.

ఇక కథ మొత్తం పూర్తి అయ్యాక క్లైమాక్స్ లో హీరో చనిపోయే సన్నివేశం ఉండడంతో అది చిరంజీవి పై సెట్ కాదు అనే ఉద్దేశంతో ఆ సినిమాను మోహన్ బాబు తో చేశాడట. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాల్లో మొదట చిరంజీవి ని అనుకున్న చివరగా ఈ సినిమాలను మోహన్ బాబుతో రూపొందించగా ఈ రెండు మూవీలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: