సినిమా ఇండస్ట్రీలో సినిమాలు ఎవ్వరైనా తెరకెక్కిస్తారు . అవి హిట్ అవుతాయి . ఫ్లాప్ అవుతాయి . కానీ కొన్ని కొన్ని సినిమాల విషయంలో అవి మారుతాయి . ఒక సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినపడితే..మరోక సినిమా పై  పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి . లేదంటే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి . కానీ ఒక సినిమాపై పాజిటివ్ కామెంట్స్ అలాగే నెగిటివ్ కామెంట్స్ రెండు వినిపిస్తే మాత్రం ఆ డైరెక్టర్ రియాలిటీ ఎక్కువగా చూపించాడు అని అర్థం . అలా తెరకెక్కించే వాళల్లో మన డైరెక్టర్స్ చాలా తక్కువ మనదే ఉన్నారు .


వాళ్ళల్లో ఒకరే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా. ఈయన తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ . కానీ ప్రతి ఒక్క సినిమాలో రీయలిస్టిక్ గా సీన్స్  తెరకెక్కిస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా "అర్జున్ రెడ్డి" సినిమా గురించి ఎక్కువగా జనాలు ఇప్పటికే మాట్లాడుకుంటూ ఉంటారు అంటే అర్థం ఆ సినిమాలో ఆయన చూపించిన రియాలిటీ . విజయ్ దేవరకొండ కెరియర్ లో ఎప్పుడు కూడా అర్జున్ రెడ్డిని  మర్చిపోలేనటువంటి సీన్స్ రాశారు. కాగా "అనిమల్" సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు .



రష్మికను బూతు పదాలు తిట్టిన జనాలే ఈ సినిమాలో రష్మిక పర్ఫామెన్స్ బాగుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు . అంతలా సందీప్ రెడ్డి వంగ జనాల నాడి పట్టుకొని సినిమాలను తెరకెక్కిస్తాడు. అయితే ప్రెసెంట్ ఆయన ప్రభాస్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . స్పిరిట్ అంటూ ఎప్పుడో నామకరణం చేసేసాడు . ఈ సినిమాలో నయనతారను హీరోయిన్గా చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొక పక్క అలియా భట్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .



అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి తల్లిదండ్రుల పాత్రల్లో స్టార్ హీరో హీరోయిన్లు నటిస్తున్నారు అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . కాగా మెగాస్టార్ చిరంజీవిని ఈ సినిమాలో ప్రభాస్ కి తండ్రి పాత్రలో చూపించబోతున్నారట . అయితే ఆయనకు భార్యగా సెన్సేషనల్ హీరోయిన్ రమ్యకృష్ణ ని ఫిక్స్ చేసుకున్నారట. చిరంజీవి - రమ్యకృష్ణ కాంబో గురించి సపరేట్ గా చెప్పాలా.. ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ . సీనియర్ ఏజ్ లో వీళ్ళ కాంబో రిపీట్ చేయడానికి సందీప్ రెడ్డివంగా బాగా కష్టపడుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు చిరంజీవి - రమ్యకృష్ణ - ప్రభాస్ ఒకే సినిమాలో నటిస్తే ఇక ఫాన్స్ ను ఆపగలమా..? రచ్చ రంబోలా.. బాహుబలి రికార్డ్స్.. పుష్ప రికార్డ్స్ అన్ని బ్లాస్ట్ అయిపోవడం ఖాయం అంటున్నారు రెబల్ ఫ్యాన్స్. చూద్దాం మరి సందీప్ రెడ్డి వంగ ఎంతవరకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసి సినిమాని సూపర్ సక్సెస్ గా మారుస్తాడో..???

మరింత సమాచారం తెలుసుకోండి: